తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా సంవత్సరంలో ఆందోళన లేకుండా ఎలా ఉండగలరు?

Posted by Manjiri Shete on Aug 10, 2021 4:59:29 PM
Manjiri Shete
Find me on:
a child and parent smiling

విద్యా రంగంలో అంతరాయాలు ఎల్లప్పుడూ తాత్కాలికమే, చాలా సార్లు ఇలా అంతరాయాలు కలగడానికి ఎక్కువగా వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడం లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం కారణమవుతూ ఉంటాయి. మార్చి 2020 వరకు మనమెవ్వరం ఒక మహమ్మారి వల్ల కలిగే భీభత్సమైన అంతరాయం ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండిపోతుందని ఊహించలేదు. మహమ్మారి మన జీవితాల్ని తల్లక్రిందులు చేయడం వల్ల విద్యా రంగం కూడా అర్థంతరంగా ఎక్కడిదక్కడ నిలిచిపోయింది. దీని తర్వాత, పాఠశాలలు ఆన్‌లైన్‌కు మారాయి, ఆన్‌లైన్ లెర్నింగ్ వల్ల ఈ రంగం నాశనం కాకుండా కాపాడబడినప్పటికీ, ఇది నాణ్యమైన క్వాలిటీ లెర్నింగ్ కి గానీ స్టూడెంట్ ఎంగేజ్‌మెంట్‌ కి గానీ సహాయపడలేదు.

లెర్నింగ్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో నేర్చుకోవడానికి గైడెడ్ అసిస్టెన్స్ అవసరం కావడంతో తమ పిల్లల అకడమిక్ లైఫ్‌లో తల్లిదండ్రుల జోక్యం పెరిగింది. తల్లిదండ్రులకు తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన పని బాధ్యతలు, గృహ, సంరక్షణ బాధ్యతలు ఉండడం వల్ల 2020 సంవత్సరం అనేక ఆటంకాలతో సమస్యలతో గడిచింది. యునెస్కో, "ఎనభై శాతం మంది తల్లిదండ్రులు/సంరక్షకులు హోం బేస్డ్ లెర్నింగ్ ని నిర్వహించడానికి సిద్ధంగా లేరు" అని తేల్చి చెప్పింది కూడా. కానీ పాఠశాలలు ఎప్పుడు మళ్లీ తెరుచుకుంటాయన్నది ఇంకా ప్లాన్ చేయబడనందున, విద్యార్థుల అకడమిక్ లెర్నింగ్ కి మార్గనిర్దేశం చేయడానికి తల్లిదండ్రులకు సహాయపడే మరింత విశ్వసనీయ నిర్మాణం అవసరం. రిమోట్ లెర్నింగ్ ఎల్లప్పుడూ బోధనా వేగంపై తగినంత శ్రద్ధ చూపదు లేదా సమర్థవంతమైన లెర్నింగ్ కి అవసరమైన విశ్వసనీయమైన బోధనా పద్ధతులను అందించదు. రిమోట్ లెర్నింగ్ అవకాశాలను విస్తరించడమనేది వేల్యుబుల్ నాలెడ్జి, నైపుణ్యాలు, విలువలను అభివృద్ధి చేయడం వంటి నేర్చుకోవడం లాంటిది కాదు.

ఏం చేయాలి

క్వాలిటీ రిమోట్ లెర్నింగ్‌ను సులభతరం చేసే మోడల్‌ని అమలు చేయడం సవాలుగానే ఉంటుంది కానీ తల్చుకుంటే అసాధ్యం మాత్రం కాదు. సంబంధిత విషయాల్లో నేర్చుకోవడానికీ, ప్రతి విద్యార్థి ఫలితాల్నీ బాగా ఉండేలా చూడడానికీ పెద్ద సంఖ్యలో పాఠశాలలు ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి. పిల్లలకు దీర్ఘకాలికంగా అంతరాయం గానీ, నష్టం గానీ కలగకుండా ప్రపంచవ్యాప్తంగా విద్యా మంత్రిత్వ శాఖలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ అకడమిక్ సిస్టమ్ ద్వారా ఈ విషయాన్ని జాగ్రత్త పడవచ్చు. రిమోట్ లెర్నింగ్ గతంలో ఇంత ప్రభావవంతంగానూ అర్థవంతంగానూ లేదు. ఇంట్లో కూర్చున్న విద్యార్థులు ఇప్పుడు తమ లెర్నింగ్ ని చాలా సరదాగా కొనసాగించవచ్చు, ఎందుకంటే ఈ సిస్టమ్ ఎంగేజింగ్ కంటెంట్ తో నిండిన రిసోర్సెస్ ని అందిస్తుంది, ఉదాహరణకు, చిత్రాలు, వీడియోలు, క్విజ్‌లు మొదలైనవి.

తల్లిదండ్రులు తమ పిల్లల పెర్పార్మెన్స్ గురించి అప్‌డేట్ అవుతూ ఉండవచ్చు, అలాగే ఒక్క క్లిక్‌తో వారి పెర్పార్మెన్‌ ని రివ్యూ చేయవచ్చు. ఆన్‌లైన్ తరగతుల కోసం తల్లిదండ్రులకి తమ పిల్లల లెర్నింగ్ కర్వ్ ని నావిగేట్ చేయడంలో సహాయపడేలా ఓరియంటేషన్ ఇవ్వడం మరొక అద్భుతమైన మార్గం. టీచర్లతో పేరెంట్స్ నిరంతరం కనెక్టింగ్ గా ఉంటూ అన్ని విషయాలూ తెలుసుకోవచ్చు కూడా. పాఠశాలలు పేరెంట్ ఓరియంటేషన్‌ని నిర్వహించి ఆన్‌లైన్ తరగతుల కోసం తల్లిదండ్రుల్ని సిద్ధపరచవచ్చు, ఆ విధంగా ఆధునిక కాలంలో లెర్నింగ్ డిమాండ్‌లతో సమన్వయం చేసుకుంటూ, రిమోట్ లెర్నింగ్ లో తమ పిల్లలకు మెరుగైన సహాయాన్ని ఎలా అందించాలో వారికి అవగాహన కల్పించవచ్చు.

యునెస్కో ఒక నివేదిక ప్రకారం, "రిమోట్ లెర్నింగ్ అనేది లెర్నింగ్ నష్టాలను పూర్తిగా భర్తీ చేసే అవకాశం లేదు, స్కూలు తిరిగి తెరిచే దశలో అవి అసమానంగా ఉండిపోతాయి. నిర్దిష్ట సందర్భాలు మరియు నిర్దిష్ట లెర్నర్స్ గ్రూపులు తప్ప - ఉదా. మంచి పెర్‌ఫార్మెన్స్ ఇస్తూ, ప్రేరణాత్మకంగా ఉండే లెర్నర్స్; మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చే పాఠశాలలు; రిమోట్ టీచింగ్ మరియు లెర్నింగ్‌తో గతానుభవం ఉన్న లెర్నర్స్ మరియు పాఠశాలలు; పాఠశాల ఆధారిత బోధనలకు ప్రత్యామ్నాయ డెలివరీ వ్యవస్థలను ఏర్పాటు చేసిన దేశాలు, 87 రిమోట్ లెర్నింగ్ రెగ్యులర్ క్లాస్ రూమ్ బోధనకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయం కాదు."

వచ్చే ఎకడమిక్ ఇయర్ కి తమ పిల్లలను సిద్ధం చేసేటప్పుడు తల్లిదండ్రులు వారి ఎంపికలను పరిగణనలోకి తీసుకోవాలి. కొనసాగుతున్న కాలంలో సంప్రదాయబద్ధంగా సాగించే విధానం సరైనదిగా లేదు. భవిష్యత్తు అనూహ్యమైన పోటీతో నడుస్తోంది, ఎప్పుడో రాబోయే కాలం కోసం విద్యార్థుల్ని సన్నద్ధం చేయాలని డిమాండ్ ఉంది. వారి భవిష్యత్తు ఎవరి కోసమూ ఆగదు, మహమ్మారి వల్ల వారి లెర్నింగ్ లోనూ వారి నైపుణ్యాలలోనూ గ్యాప్స్ రావడమనేదాన్ని సాకుగా పరిగణించడం జరగదు. ఫ్యూచరిస్టిక్ లెర్నింగ్ కి సపోర్ట్ చేసే పాఠశాలలు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు ఇంటి నుంచే నేర్చుకోవటానికి తగినంత సహాయం అందించే విధానాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది.

తమ పిల్లల క్వాలిటీ లెర్నింగ్ కోసం తల్లిదండ్రులకు LEAD ఎలా సహాయపడుతుంది?
ప్రస్తుత కాలంలో ఇంటి నుంచి క్వాలిటీ లెర్నింగ్ అందుకునేలా చేయడానికి సులభతరమైన టెక్నాలజీని ఉపయోగించడమనేది ఒక కల. LEAD తో, ప్రతి వాటాదారుడూ సమర్థవంతంగా నేర్చుకోవడానికి ఒక ప్రత్యేకమైన యాప్‌ను పొందుతాడు. LEAD Student App, డిజిటల్ లెర్నింగ్ కంటెంట్, ఫిజికల్ రీడర్ & వర్క్ బుక్స్, లెర్నింగ్ యాక్టివిటీస్, ఇ-బుక్స్, రెగ్యులర్ అసెస్‌మెంట్‌లు, అసైన్‌మెంట్‌లు, క్విజ్‌లు, పర్సనలైజ్డ్ రివిజన్‌లు, హోమ్ ప్రాక్టీస్ మొదలైన వాటిల్లో విద్యార్థుల్ని నిమగ్నమయ్యేలా చేస్తుంది. పైగా, హాజరు, ప్రోగ్రెస్ రిపోర్టుల ద్వారా ఈ స్టూడెంట్ పేరెంట్ యాప్ విద్యార్థులకు ఆసక్తికరంగా ఉండే రిసోర్సెస్ లో నిమగ్నమై ఉంచేందుకు సహాయపడుతుంది.

student parent app

మీ బిడ్డను గతంలో 'చక్కగా' గడిచిపోయిన రోజుల్లో లాగే ప్రతిరోజూ ఒక తరగతికి హాజరయ్యేలా చూడడం కూడా చాలా మంది తల్లిదండ్రులకు సవాలుగా ఉంటోంది. ఆన్‌లైన్ లెర్నింగ్ లో ఉన్నట్టు ఎలాంటి స్ట్రక్చర్ లేనందు వల్ల పిల్లలు అందులో ఆసక్తిని కోల్పోతారు. అయితే, ఈ సమస్యకి LEAD ఒక పరిష్కారం అందిస్తోంది. ఉపాధ్యాయులు టాబ్లెట్‌ని ఉపయోగించడం మొదలుపెట్టగానే LEAD-పవర్డ్ స్కూల్స్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా తమ పనిలో నిమగ్నమవుతారు. ఎందుకంటే ఈ టీచర్లు వివరణాత్మక పాఠ్య ప్రణాళికలు, ఆడియో-వీడియో రిసోర్సెస్, పుస్తకాల సాఫ్ట్ కాపీలు, ఇంకా అనేక కార్యకలాపాలను కలిగి ఉన్న టాబ్లెట్‌ను ఉపయోగిస్తారు. వారు ఆ కాన్సెప్ట్స్ ని యాక్టివిటీ లేదా వీడియో ద్వారా వివరిస్తారు. తరువాత చిన్న చిన్న గ్రూప్స్ గా సాధన చేస్తారు. విద్యార్థులు స్వతంత్రంగా ప్రశ్నలకు సమాధానమిచ్చే వ్యక్తిగత అభ్యాసం కూడా ప్రోత్సహించబడుతుంది. ఈ కేంద్రీకృత సర్కిల్ డిజైన్ ఉపాధ్యాయులు విద్యార్థులకు భావనను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

LEAD చేసిన సర్వే ప్రకారం, క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కాని విద్యార్థుల కంటే 80%+ హాజరు ఉన్న విద్యార్థులు సగటున 40-45% ఎక్కువ స్కోర్ చేసినట్లు సంఖ్యలు చెబుతున్నాయి. లీడ్‌ ప్రారంభంలోని 55% తో పోలిస్తే, విద్యార్థులు సంవత్సరం ప్రారంభంలో 80% పొందారు.

LEAD మీ పిల్లల భవిష్యత్తుని సిద్ధం చేయడానికి ఉపయోగపడుతోంది. మీ పిల్లవాడిని LEAD పవర్డ్ స్కూల్ లో చేర్చడానికి:ఇప్పుడే అడ్మిషన్ ఫారం నింపండి

 
About the Author
Manjiri Shete
Manjiri Shete

Manjiri is a Senior Content Marketing Executive at LEAD School. She loves reading to the point where a good book has made her skip social gatherings that witness her not-so-funny attempts at being funny. She has an inclination towards travelling, fashion, art and eating doughnuts.

LinkedIn
Give your school the LEAD advantage